Sunday, January 19, 2025

తృణమూల్‌తో పొత్తుకు ఇంకా అవకాశం

- Advertisement -
- Advertisement -

బెంగాల్ సీట్లపై మమత ప్రకటించినా ఇండియా కూటమిలో సభ్యురాలే
బిజెపి ఓటమే ఆమెకు ప్రధానం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్

గ్వాలియర్ : పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ సీట్లకు పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఒక వైపు నిర్ణయించగా, మరొక వైపు కాంగ్రెస్ తనదైన ధీమాతో ముందుకు సాగుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు మమతా బెనర్జీ సారథ్యంలోని టిఎంసితో పొత్తుకు ఇంకా అవకాశం ఉందని కాంగ్రెస్ ఆదివారం ప్రకటించింది. పాట్నాలో ప్రతిపక్ష ర్యాలీకి ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ల ఇన్‌చార్జి జైరామ్ రమేష్ ‘పిటిఐ’తో మాట్లాడుతూ, తాము ఇంకా ఆశాభావంతో ఉన్నామని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను ఇంకా ఇండియా కూటమిలో ఉన్నానని, బిజెపిని ఓడించడమే తన ప్రాథమ్యమని చెప్పినందున ఆమె మాటలను విశ్వసిస్తున్నామని తెలిపారు. ‘ఆమె ప్రాథమ్యాన్ని, ఉద్దేశాన్ని మేము పరిగణనలోకి తీసుకుంటున్నాం’ అని రమేష్ చెప్పారు.

‘మేము ఇంకా తలుపులు మూయలేదు. తాము (పశ్చిమ బెంగాల్‌లో) మొత్తం 42 సీట్లకు పోటీ చేస్తామని ఆమె ఏకపక్షంగా ప్రకటించారు. అది ఆమె ప్రకటన. మాకు సంబంధించినంత వరకు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. తలుపులు ఇంకా తెరచుకునే ఉన్నాయి. తుది మాట చెప్పేంత వరకు ఖరారు కాదు’ అని రమేష్ అన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ర్యాలీ నిర్వహణ గురించి రమేష్ ప్రస్తావిస్తూ, అది సంయుక్త ప్రతిపక్షం ర్యాలీ అని, ప్రధాని శనివారం అక్కడికి వెళ్లిన తరువాత జరగనున్నదని చెప్పారు.

‘అది ఎంతో ముఖ్యమైన రాజకీయ ర్యాలీ. బిజెపిని, దాని మిత్ర పక్షాలను ఓడించేందుకు ప్రతిపక్షాల సమైక్యతను అది సూచిస్తుంది’ అని రమేష్ తెలిపారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ కూడా ర్యాలీలో పాల్గొనేందుకు తన ప్రస్తుత ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు విరామం ఇచ్చారని రమేష్ తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News