- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర సినిమాకు మరో అవార్డు దక్కింది. ఉగాది’ సందర్భంగా చెన్నైలో శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ ఇచ్చిన అవార్డుల్లో దేవరను బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు వరించింది. ఈ విషయాన్ని ఫొటోగ్రఫీ డైరెక్టర్ రత్నవేలు ఎక్స్ వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాకు డీఓపీగా పనిచేస్తున్నారు.
కాగా, గతేడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత.. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇటీవలే జపాన్‌లో ఈ సినిమాను రిలీజ్ చేశారు.
- Advertisement -