నల్లగొండ: డోర్నకల్ నుండి కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడ సూత్రప్రాయంగా కొత్త రైలుమార్గం మంజూరైనట్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. రైల్వేస్టేషన్‌లో సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ప్రయాణికులతో మాట్లాడి, సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంట్‌లో, వెలుపల తన నిరంతర ప్రాతినిద్యాల కారణంగా, ఇప్పుడు మిర్యాలగూడ, నల్లగొండ రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్పారు. చెన్నై ఎక్స్‌ప్రెస్, తిరుపతి ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్టేషన్‌లలో ఆపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే డోర్నకల్ నుండి కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడ వరకు కొత్త రైలు మార్గానికి సూత్రప్రాయంగా మంజూరైనట్లు తెలిపారు. ప్రస్తుతం గూడ్సు రైళ్లు మాత్రమే నడుస్తున్న మేల్లచెరువు, మట్టంపల్లి, జానపాడు, విష్ణుపురం, మిర్యాలగూడ రైల్వేలైన్‌లో ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు.
మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సైకర్యాల పెంపుదల అంశాన్ని రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు. ఆయనవెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, డిసిసి అద్యక్షులు కేతావత్ శంకర్‌నాయక్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లకా్ష్మరెడ్డి, పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు మహబూబ్ అలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడబోయిన అర్జున్, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు కోట శ్రీనివాసరావు, ఎంపిటిసి సర్పంచ్‌లు తదితరులు ఉన్నారు.