Thursday, January 23, 2025

డోర్నకల్-మిర్యాలగూడెం రైల్వేలైన్ రద్దుచేయాలి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : డోర్నకల్ నుంచి మిర్యాలగూడెం వరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న నూతన రైల్వే లైన్ ను వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పల్లెగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఎం.వెంకటాయపాలెం, గూడూరు పాడు, గుండాల తండా, ఆరెకోడు, ఆరేంపుల, బారుగూడెం, పొన్నెకల్లు, మద్దులపల్లి, తెల్దార్ పల్లి, దారేడు, జాన్ బాద్ తండ గ్రామాలకు చెందిన రైతులు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది కార్పొరేట్ వ్యక్తుల స్వార్థం కోసం ఏర్పాటు చేసే రైల్వే లైన్ కోసం సన్న చిన్న కారు రైతుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని రైతులు వాపోయారు. ఖమ్మం రూరల్ మండలం ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు పయనిస్తుందని,

కానీ ఇలాంటి సమయంలో మండలం నుంచి రైల్వేలైన్ వెళితే అభివృద్ధి అంత ఒక్కసారిగా ఆగిపో తుందన్నారు. ఇప్పటికైనా రైల్వే లైన్ రద్దు చేయకపోతే రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులు గుర్రం అచ్చ య్య, కాంగ్రెస్ నాయకులు కళ్లెం వెంకటరెడ్డి, సిపిఎం నాయకులు నండ్ర ప్రసాద్, సిపిఐ నాయకులు పుచ్చకాయల సుధాకర్, ఏదులాపురం సొసైటీ చైర్మన్ జర్పుల లక్ష్మణ్ నాయక్, మారెమ్మ గుడి చైర్మన్ మట్టా వెంకటేశ్వరరావు, బిఆర్‌ఎస్ నాయ కులు బండి జగదీష్, అరేకోడు సర్పంచ్ ఉప్పుగండ్ల వెంకటనారాయణ, అక్కినపల్లి వెంకన్న, వివిధ గ్రామాలకు చెందిన రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News