Friday, December 20, 2024

నేడు దోస్త్ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బిఎ, బి.కాం, బిఎస్‌సి, బిబిఎ,బిబిఎం, బిసిఎ తదితర డిగ్రీ కోర్సుల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు.

దోస్త్ పరిధిలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మూడు నాలుగు విడతల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News