Monday, December 23, 2024

దోస్త్ అంటే నువ్వేరా..

- Advertisement -
- Advertisement -

Dostan ante nuvera friend aunty nuvera Movie

 

యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ’దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా..’ అనే లిరికల్ సాంగ్‌ను నిజ జీవితంలో మంచి మిత్రులు అయిన టాలెంటెడ్ హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు. ఈ పాటలో టాలీవుడ్ రియల్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్- గోపీచంద్, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్, ఎన్టీఆర్- రామ్‌చరణ్, మహేష్ బాబు- వంశీ పైడిపల్లి … ఇలాంటి వారిని చూపిస్తూ స్నేహం గొప్పదనం తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News