డబుల్ బెడ్‌రూం ఇండ్ల పట్టాల పంపిణికి ముహూర్తం ఖరారు, నిరుపేదకు నీడను
అందించాలనే సిఎం సంకల్పం, రేపు కమాన్‌పూర్‌లో మంత్రి గంగుల చేతుల మీదుగా పట్టాల పంపిణీ
మన తెలంగాణ /కరీంనగర్ రూరల్: నిరుపేదల కళ సొంతింటి కళ ఆ కళను తెలంగాణ సిఎం కెసిఆర్ చే యనున్నారు. దీనితో పేదలకు సొంతంటి కళ తీరనుంది.కొత్తపల్లి మండలంలోని కామాన్ పూర్ గ్రా మంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను ఈ నెల 19న పేదలకు పట్టాలను బిసి సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేయనున్నారు.అందు భాగంగా శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్ కామాన్ పూర్ గ్రామంలో డబుల్‌బెడ్ రూంల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధికారులు,స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పంపి ణీచేయాలని సూచించారు.నియోజన వర్గంలో ఇండ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నాయని,కొన్ని చోట్ల సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతూ మందకొడి సాగుతున్నాయని,త్వరలో ఎలగందుల,ఖాజీపూర్‌లో కూడా పంపిణీ చేయనున్నమని మంత్రి తెలిపారు. కొ విడ్ కారణంగా ఇండ్ల నిర్మాణం పట్టాల పంపిణి కా ర్యక్రమం కొంత జాప్యం జరిగిందని,కరీంనగర్ ని యోజక వర్గంలో మొదటి విడుతలో 1400 ఇండ్లు మంజురు ఆయ్యాయని,మౌళిక సదుపాయాలు పూర్తి కావాడంతో దశలవారిగా అన్ని గ్రామాల్లో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పట్టాల పంపిణి కార్యక్రమం చేపడుతామని తెలిపారు.
అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కళ సాకారం కాబోతుందని అన్నారు.అదివారం సా ముహిక గృహప్రవేశాలు చేపట్టనున్నామని,కమాన్ పూర్ గ్రామానికి 67 ఇండ్లు మంజురు ఆయ్యాయ ని,మొదట డ్యామ్ ముంపు గ్రామమైన రాములపల్లి కి ప్రాధాన్యత ఇస్తున్నామని,మిగతావి కమాన్ పూర్ గ్రామంలోని ఇండ్లు లేని నిరుపేదలకు కేటాయించనున్నామని తెలిపారు.డబుల్‌బెడ్‌రూల పంపిణీలో ఎ టువంటి పైవీరలకు తావులేకుండా అర్హులైన నిరుపేదలకు అందించాలని మంత్రి ఆధికారులకు ఆదేశించారు.
సిఎం కెసిఆర్‌కు నిరుపేదలు రుణపడి ఉంటారు: కమాన్‌పూర్ జినుక సంపత్
సొంతిఇళ్లు లేని నిరుపేదలకు తెలంగాణ సిఎం కెసిఆర్ చేపట్టిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నిరుపేదలకు వరంగా మారిందని,మొదటి విడుతలో మా గ్రామంలో మంత్రి కమలాకరన్న చొరవతో డబుల్‌బెడ్‌రూంలు త్వరగా పూర్తి ఆయ్యాయని, మంత్రి కమలాకరన్న ప్రత్యేక కృతజ్ఞతలు మా గ్రామం తరుపున,నా తరుపున తెలుపుతున్నారు.