Monday, December 23, 2024

పేదల ఆత్మ గౌరవ ప్రతీక డబుల్ బెడ్రూం ఇండ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునిక సౌకర్యాలతో పేదల కోసం కొల్లూరు లో నిర్మించిన 15 వేల 60 ఇండ్ల సముదాయాన్ని ఈనెల 22న ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొల్లూరులో ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంగళవారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రారంభానికి అన్ని విధాలా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రూట్ మ్యాప్ పై చర్చించి పలు సూచనలు చేశారు.

కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గా, ఆసియా మోడల్ గా నిలువనుందని మంత్రి ప్రశాంత్ రరెడ్డి పేర్కొన్నారు. మంత్రి కెటిఆర్ ప్రత్యేక చొరవతో ఈ నిర్మాణాలు సకల సౌకర్యాలతో పూర్తి అయ్యాయని తెలిపారు. పేదల ఆత్మ గౌరవ ప్రతీకగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. ఈనెల 22న ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ కొల్లూరు గృహ సముదాయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. పేదల కోసం 100 శాతం సబ్సిడీతో పూర్తి ఉచితంగా కెసిఆర్ ప్రభుత్వం ఈ ఇండ్లను అందిస్తోందన్నారు. గతంలో కాగితాల్లో ఇండ్లు చూపించే వారు లక్షల రూపాయలు బిల్లులు డ్రా చేసుకునే వారని నేడు కళ్ళకు సాక్షాలుగా డబుల్ బెడ్రూం ఇండ్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఆలస్యమైనా మంచిగా కట్టించాలనేది సిఎం కెసిఆర్ ఆలోచన అని అన్నారు.

ముఖ్యమంత్రి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఆరుగురు లబ్దిదారులకు ఇంటిపట్టా అందజేస్తారనీ తెలిపారు. నిర్మాణ సముదాయంలో సుమారు 50 నుంచి 60వేల మంది ఉండే ఆస్కారం ఉన్నందున 103 షాపింగ్ కాంప్లెక్స్ లు, కమ్యూనిటీ హాల్, పోలీస్ స్టేషన్,లిఫ్ట్ లు,మంచినీళ్లు,డ్రైనేజీ ,రోడ్లు, అన్ని రకాల మౌళిక సదుపాయాలు ఉంటాయని మంత్రి వివరించారు. భవిష్యత్తులో కొల్లూరు లోని ఈ ప్రాంతం మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక చొరవ చూపిన మంత్రి కెటిఆర్‌కి, నిర్మాణ సంస్థకు, జిహెచ్‌ఎంసి సిబ్బందికి,గృహ నిర్మాణ శాఖ అధికారులకు మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట హెచ్‌ఎండిఎ కమిషనర్ అరవింద్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్,సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర,గృహ నిర్మాణ శాఖ అధికారులు ఉన్నారు.

double bedroom complex

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News