హైదరాబాద్ : బతుకమ్మ పండుగ రోజున డబుల్ బెడ్ రూమ్ గృహ ప్రవేశాలు చేయించడం సంతోషంగా ఉంది. సద్దితిన్న రేవు తలిస్తే.. దేవుడు సల్లగా చూస్తాడని కోరిన మంత్రి హరీశ్. గత కాంగ్రెస్ హయాంలో బేస్మెంట్ కే డబ్బులు సరిపోయేవీ కావనీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు కట్టి, కడప పెట్టి, ఇళ్లు తాళం చెవి మీ చేతిలో పెట్టి కొత్తింట్లోకి తోలుతున్నామని చెప్పిన మంత్రి హరీశ్. గతంలో ఎమ్మెల్యేలుగా విజయరామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డిలు ఎవరొచ్చినా.. మీ గజ్వేల్ ప్రజల బతుకు దెరువు మారలేదని, సీఎం కేసీఆర్ వచ్చాక గజ్వేల్ ప్రజల బతుకు దెరువు మారింది. బీజేపీ నేతలకు మాటలెక్కువ.. చేతలు తక్కువ. దేశంలో ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు లేవని డబుల్ ఇంజన్ గవర్నమెంట్ బీజేపీ పై మంత్రి మండిపడ్డారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ పాలిత ప్రాంతాల్లోని పింఛన్లను మన తెలంగాణ రాష్ట్రంలోని పింఛన్లకు, అలాగే కరెంటు కూడా సరిగ్గా లేక గోస పడుతున్నట్లు.. ఇలా ఎన్నోరకాలుగా చాలా వత్యాసం ఉన్నది.
70 ఏండ్లలో కాని పనిని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినట్లు మంత్రి వెల్లడి. టీడీపీ హయాంలో రూ.70, కాంగ్రెస్ హయాంలో రూ.200 ఇచ్చారనీ, కానీ ఇవాళ సీఎం కేసీఆర్ వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు రూ.2016 అందిస్తున్నట్లు మంత్రి వెల్లడి. ప్రతీ మండలానికి ఎస్సీ వెల్ఫేర్, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కేసీఆర్ సర్కారు తెచ్చినట్లు పేర్కొన్న మంత్రి.
– రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ.
టీఆర్ఎస్ పార్టీ. పేద ప్రజల పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని హిందు-ముస్లింలు ప్రతీ కులం, మతం వాళ్లు సంతోషంగా ఉన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలలో ఫెయిల్ రాష్ట్రం గుజరాత్ అయితే అన్నింటా ఆదర్శ రాష్ట్రం తెలంగాణ. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందరికీ అభివృద్ధి జరిగింది. ఇంటింటా మిషన్ భగీరథ నీళ్లు, అర్హులందరికీ ఆసరా ఫించన్లు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై సీఎం కేసీఆర్ గారికి నియత్ ఉంది. కాబట్టే రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి.