- తెలంగాణ ప్రాంతం ఆనాడు కరువుకు నెలవు … నేడు కరువుకు సెలవు
- కాళేశ్వరం జలాలతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పేట్టే దాన్యరాశిగా తెలంగాణ
- ఎండాకాలంలో కూడా చిన్నకోడూరు పెద్ద చెరువు మత్తడి
- ఒకప్పుడు ఆంధ్ర నుంచి చాపలను తెచ్చుకున్నాం ఇప్పుడు విదేశాలకు ఎగుమతి 75 శాతం సబ్సిడీతో 550 స్ప్రింక్లర్లు చిన్నకోడూరు గ్రామ రైతులకు అందించాం
- ప్రభుత్వాసుపత్రిలోనే నాణ్యమైన వైద్య సేవలు
- రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
చిన్నకోడూరు: డబుల్ బెడ్‌రూం ఇండ్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఆర్థిక , వైద్యారో గ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం చిన్నకోడూరు మండల కేంద్రంలో 48 డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులచే గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం ఆనాడు కరువకు నెలవు… నేడు కరువుకు సెలవు అన్నా రు. గతంలో కరువు సమయంలో పశువులకు మేత దోరకక ఆంధ్ర నుంచి గడ్డి తెప్పించి పశుగ్రాసం కోసం కేం ద్రాలు పెట్టామన్నారు. వర్షాల కోసం కప్పతల్లి ఆట, వ రుణ దేవునికి పూజలు చేసేవారని , కాళేశ్వరంతో జలాల తో కరువుకు శాశ్వత సెలవు దొరికిందన్నారు. నేడు రాష్ట్రాలకు అన్నం పెట్టె ధాన్యరాశిగా కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి చెందిందన్నారు. ఒకప్పు డు ఆంధ్ర నుంచి చేపలు తెచ్చుకున్నమనం కాళేశ్వరం జ లాలతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు.
సిద్దిపేట నుంచి చిన్నకోడూరు వరకు రూ. 66 కోట్లతో ఫోర్ లైన్ రోడ్డు వేసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రం వచ్చాక ఎలా మారిందో మీరే గమనించాలన్నారు. ఇండ్లు రాని పేదవారు అంటే సొంత జాగలోనే ఇళ్లు కట్టుకునేలా 3 లక్షలు ఇంటిరాని పేద వారు ఉంటే సొంత జాగలోనే ఇళ్లు కట్టుకునేలా రూ. 3 లక్షలు ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేస్తామన్నా రు. జాగ లేనోళ్లకు ఇంటి స్థలాలు అందజేస్తామన్నారు. మండలంలో 479 ఇళ్లు కట్టించామన్నారు. పారదర్శకం గా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ రోజా శర్మ, ఎంపిపి కూర మాణిక్యరెడ్డి, ఎఎంసి చైర్మన్ కొండం వనిత, ఎంపిపి ఉపాద్యక్షుడు పాపయ్య, పిఎసిఎస్ చైర్మన్‌లు కనకరాజు, సదానందం గౌడ్, సర్పంచ్ ఉమేశ్ చంద్ర, ఎంపిటిసి సభ్యులు శ్రీనివాస్, శారద కాముని ఉమేశ్ శ్రీనివాస్‌లున్నారు.