Saturday, December 21, 2024

కెసిఆర్ కిట్లు ఇస్తుంటే..ప్రతిపక్షాలు తిట్లు ఇస్తున్నారు : హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

అమీన్‌పూర్: ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ కిట్లు అందజేస్తుంటే ప్రతిపక్షాలు అర్థం పర్థం లేని తిట్లు ఇస్తున్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఎక్కడో ఉన్న నటుడు రజినీకాంత్ గుర్తించి కితాబిస్తుంటే ఇక్కడున్న గజనీగాళ్లకు కనపడడం లేదా అని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గం కొల్లూరులో నిర్మిచిన డబుల్ బెడ్‌రూం ఇడ్ల పంపిణీలో భాగంగా రెండో విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. జనవరి చివరి నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ నిరుపేద ప్రజల బతుకు చిత్రాన్ని మార్చిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సొంత ఇళ్లులేని కుటుంబం ఉండాలన్నదే ప్రభుత్వ లక్షమని, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.

ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్ల్లో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు దిక్సూచిగా మారుతుందన్నారు. అత్యంత ఖరీదైన ప్రంతమైన తెల్లాపూర్, అమీన్‌పూర్ ప్రాంతాల్లో కెసిఆర్ ప్రభుత్వం పేదల కోసం డబుల్ నిర్మాణాలు చేపట్టి వారి ఆత్మగౌరవాన్ని పెంచిందన్నారు. 9వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి కేవలం గ్రేటర్ పరిధిలోనే లక్ష డబుల్ బెడ్‌రూం నిర్మాణాలను చేపెట్టిన ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని, కొల్లూర్‌లో రూ. 60లక్షల విలువైన ఇళ్లను ఒక్కరూపాయి ఖర్చులేకుండా ఎలాంటి మిత్తి లేకుండా ఉచితంగా అందించిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో నిర్మించడం సాధారణ విషయం కాదని, సంపన్నుల నివాసాల పక్కనే పేద ప్రజల ఆత్మగౌరవ భవనాలు నిర్మించామన్నారు. డబుల్ నిర్మాణాల్ల్లో నివాసం ఉండే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటుందన్నారు.

అనంతరం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నియాజకర్గంలోని ఆయా ప్రాంతాల్లో దాదాపు 40వేల డబుల్ బెడ్‌రూం నిర్మాణాలు చేపట్టారని, అందులో స్థానికులకు కనీసం 10శాతం కేటాయించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కొల్లూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పటాన్‌చెరు ప్రాంతా ప్రజలకు 500 మంది లబ్ధిదారులకు మంత్రి హరీశ్‌రావుతో కలిసి ప ట్టాలు అందజేశారు. ఇక్కడి రైతులు తమ భూములను త్యాగం చేశారని వారికి తగిన న్యాయం చేసేలా ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక కోటాను ఇవ్వాలని ఆయన మంత్రి కోరారు. పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక రాష్ట్రంగా నేడు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిస్తుందన్నారు. నేడు జరుగుతున్న డబుల్ బెడ్‌రూం నిర్మాణాలే అందుకు నిదర్శనమన్నారు. ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక వసతులతో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడం సాధారణ విషయం కాదని, ఇళ్లను పొందిన ప్రతి లబ్ధిదారుడికి ఈ మధురక్షణం జీవితాతం గుర్తుండిపోతుందని ఆయన అన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన లబ్ధిదారులు నేటి నుంచి పటాన్‌చెరు ప్రాంతవాసులేనని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గోపినాథ్, దానం నాగేందర్, ప్రకాష్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్, లలితాసోమిరెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, తెల్లాపూర్ మున్సిపాల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కార్పొరేటర్లు పుష్పానాగేష్, సిందు ఆదర్శరెడ్డి, మెట్టు కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News