నిజామాబాద్: పార్టీలకు అతీతంగా అర్హత కలిగి ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 112 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రశాంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు గృహప్రవేశం చేయించి వారికి ఇండ్లు మంజూరు చేసి ధ్రువీకరణ పత్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డబుల్ రూమ్‌లు విషయంలో విమర్శించిన కాంగ్రెస్, బిజెపి వాళ్లను గతంలో ఎందుకు నిర్మించి ఇవ్వలేదని ప్రశ్నించారు. గతంలో ఇచ్చి ఉంటే ఇప్పడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ఎక్కువ మంది అర్హత కలిగిన వారు ఉంటే డ్రా చేసి ఇస్తామని మంత్రి తెలిపారు. విడతల వారిగా అందిరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. భూములు ఉన్నవారికి రైతు బంధుతో ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు. మా ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాల తరువాత ఇండ్లు నిర్మించి ఇచ్చామన్నారు.
పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: వేముల ప్రశాంత్
- Advertisement -
- Advertisement -
- Advertisement -