Saturday, November 23, 2024

త్వరలో కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభం: మేయర్

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/సిటీ బ్యూరో: కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరలోనే ప్రారంభిస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కొల్లూరు ఫేస్ 2లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల ఆత్మగౌరవంతో బతకాలనే సంకల్పంతో వారికి సొంతింటి కళ నెరవేరే విధంగా నయా పైసా లేకుండా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.ఈ ఇళ్లను నగరంలో నిరుపేదలకు పంపిణీ చేయడం జరుగుతుందనికొల్లూరు ప్రాంతం దూరంగా ఉందన్నఅపోహలు వద్దన్నారు.

కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలతో ఈ ప్రాంతంలో సుమారు 20 వేల పైగా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.కొల్లూరులో 117 బ్లాక్ లలో 15,600 రెండు పడకల గదుల నిర్మాణం సకల సౌకర్యాలతోఒక్కొక్క బ్లాక్ వివిధ డిజైన్లతో నిర్మించడం జరిగిందన్నారు. త్రాగునీరు, నిరంతరంగా విద్యుత్ సరఫరా లిఫ్టులు అన్ని వసతులు ఏర్పాటు చేశారని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, బస్టాండ్ ఇతర వసతులు కల్పించడంతో పాటు నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు లేకుండా షటర్ లను కూడా ఏర్పాటు చేసినట్లు మేయర్ వివరించారు.కొల్లూరు ఫేస్ 2 లో 15,600 తో పాటుఫేస్ 1 లో 2052 ఇళ్లు, ఈదుల నాగులపల్లి లో 1944 ఇళ్లు పూర్తయ్యాయి. ఇళ్ల కేటాయింపులు పారదర్శకంగా జరుగుతుందని ప్రతి ఒక్కరికి లాటరీ ద్వారా ఇళ్లు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు పరిశీలించినట్లు మేయర్ చెప్పారు. డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలు నిర్మించిన ఇళ్లకంటే ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఓ.ఎస్.డి సురేష్, డిప్యూటీ ఈ ఈ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News