Friday, November 15, 2024

అప్పుడు గుడిసెలు ఉండేవి… ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు…

- Advertisement -
Double bedroom houses opened in Rasoolpur
మేడ్చల్: కెసిఆర్ ప్రభుత్వం అందరికి గౌరవంగా ఒక ఇల్లు ఉండేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి పేదవారికి ఇస్తుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గం లో రసూల్ పూరలోని మైసమ్మ కట్ట సిల్వర్ కాంపౌండ్ వద్ద కొత్తగా నిర్మించిన ఇండ్లు మంత్రులు తలసాని యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్నలు సుమారు 166 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక మంచి సొంతిల్లు అందరి ఆశ అని, మరి ఈ ఆశ ను నెరవేర్చే కార్యక్రమమే డబల్ బెడ్ రూమ్ ఇల్లు అని పొగిడారు. ఒకప్పుడు రసూల్ పురాలో కేవలం గుడిసెలు కనిపించేవని, కానీ ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజల మనసులో ఆనందంగా ఉండడం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంచి ఇల్లు కట్టించారని ప్రశంసించారు.
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రైతులకు ఉచిత విద్యుత్తు , బీమా, వృద్దులకు ఆసరా పింఛన్లు, పేద పిల్లల పెళ్లిళ్లకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి లాంటి పథకాలు అమలు చేస్తున్నామని కొనియాడారు. ఇప్పటి వరకు నగరంలో రాష్ట్రంలో ఎన్నో చోట్లలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టించిందని, టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగ మెరుగైన సేవలందిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణం కొరకు కృషి చేస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, ఎఎంసి చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, కంటోన్మెట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News