- సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి
సంగారెడ్డి: ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో ప్రభుత్వ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలైందని, ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు.
మొత్తం 10331 సభ్యులకు 4767 మంది సభ్యులు తమ లబ్ధిదారుల వాటా చెల్లించారని వారికి విడుతల వారీగా ఆరోగ్యకరమైన గొర్రెలు యూనిట్స్ పంపిణీ చేయడానికి సిద్ధం చేయాలని పశు సంవర్దకశాఖ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా కొన్ని యూనిట్‌లను పంపిణీ చేశామని, మిగిలిన సభ్యులకు కూడ త్వరగా గొర్రెలు అందజేయాలన్నారు. జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. వాటర్ పైప్‌లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్దకశాఖ అధికారి వసంతకుమారీ, ఎడి ప్రభాకర్ తదితరులున్నారు.