Sunday, December 22, 2024

పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాల్సిందే : డాక్టర్ లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని పేదలకు వచ్చే నెల 7వ తేదీలోగా డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయాలని బిజెపి నేత, ఎంపి డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి శ్రేణులకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ఎంపి డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కెసిఆర్ విస్మరించారన్నారు. ముఖ్యమంత్రికి ఓట్లు కావాలి తప్పితే పేద ప్రజల సమస్యలు పరిష్కరించరని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్ లో యోగి ప్రభుత్వం 50లక్షల మందికి ఇల్లు కట్టించిందన్నారు. పథకాల పేరుతో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దోచుకున్నారు. బిసిలపైన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కవిత ఢిల్లీలో కాదు ప్రగతిభవన్ ముందు ధర్నా చేయాలన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ లోపు అర్హులందరికీ రెండు పడక గదుల ఇళ్లు, బిసి బంధు, దళిత బంధు ఇవ్వాలి.. లేనిపక్షంలో సెప్టెంబర్ 7న మిలియన్ మార్చ్ తరహాలో హైదరాబాద్ ను దిగ్బంధిస్తాం అని ఆయన హెచ్చరించారు. వివిధ జిల్లాల్లో జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో రాష్ట్ర ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News