ధృవ పత్రాలను అందజేసిన మేయర్ విజయలక్ష్మి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
హైదరాబాద్ : వనస్థలిపురంలోని పద్మావతి కాలనీలో ఇటీవల వరద నీటి డ్రైనేజీలో పడి మరణించిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేసింది. స్టార్మ్ వాటర్ డ్రైయిన్ పూడికతీతకు సంబంధించి నిబంధనలకు విరుద్దంగా రాత్రి వేళా కాంట్రాక్టర్ పనులు చేస్తుండగా శివకుమార్, అంతయ్య ఇద్దరు కార్మికులు అందులో గల్లంతైన ప్రాణాలు కొల్పొయిన విషయం తెలిసిందే. పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయించారు.
డ్రైనేజీలో గల్లంతై మరణించిన శివకుమార్ భార్య ధరణి శ్రావణగౌరీ, అంతయ్య భార్య నల్లవెల్లి భాగ్యమ్మలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరు సంబంధించిన ధృవ పత్రాలను సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎల్‌బినగర్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డిలు అందజేశారు. డబుల్ ఇళ్ల పత్రాలను అందించారు. ఇందులో భాగంగా వనస్థలిపురం రైతు బజార్ వద్ద జై భవాని కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం సముదాయంలోని ప్లాట్ నంబర్ 701 నంబర్‌ను భాగ్యమ్మకు 702ను శ్రావణ గౌరికి కేటాయించారు. ఈ బాధిత కుటుంబాలకు ఇప్పటికే రూ.17లక్షల చోప్పున ఆర్ధిక సహాయం సైతం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బినగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.