Thursday, January 23, 2025

కేంద్రం నిధులతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు: ఏపి బిజెపి నేత పురంధేశ్వరి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో రెండు పడకల ఇళ్లు నిర్మించారని ఏపి బిజెపి నేత పురంధేశ్వరి అన్నారు. మంగళవారం నాడు కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్ధికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన మీడియా సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో 4 కోట్ల ఇళ్లను మంజూరు చేసిందని, అందులో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందన్నారు.

దళితుడుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కెసిఆర్ మాట తప్పారని గుర్తు చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి హామీ కూడ నెరవేర్చలేదన్నారు. దళితబంధు పథకంలో అవినీతి జరుగుతోందని స్వయంగా కెసిఆర్ ఒప్పుకున్నారని తెలిపారు. విద్యాశాఖలో వేలపోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది అవసరం అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయన్నారు. బిజెపి మిత్రపక్షమైన జనసేన పార్టీ అభ్యర్ధి ప్రేమ్‌కుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కూకట్‌పల్లి అభివృద్ది పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News