Monday, December 23, 2024

డబ్బులిస్తేనే.. డబుల్ బెడ్ రూమ్ : ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : లబ్ధిదారుల జాబితా ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ లేదని… రూ. 3 లక్షలు ఇచ్చిన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నారని బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల్ల లబ్ధిదారుల జాబితా బయటకు తెలియకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బిఆర్‌ఎస్ నేతలు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. రూ. 3 లక్షలు ఇచ్చిన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పూర్తి ఆధారాలతో త్వరలో గవర్నర్‌ను కలుస్తామని ప్రభాకర్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News