Friday, December 20, 2024

డబుల్ బెడ్ రూంల్లో ..డబుల్ గోల్‌మాల్

- Advertisement -
- Advertisement -

ఒక్కో ఇంటికి రూ. 2 నుంచి 3లక్షల దాకా వసూళ్లు, లక్షల్లో వెనుకేసుకున్న రాజకీయ నేతలు, దళారులు, అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో చక్రం తిప్పిన ఓ అధికారి
లక్షల్లో అక్రమ వసూళ్లు, నిబంధనలంటేనే ఆయనకు తూచ్
ఇళ్ల కేటాయింపుల్లోనూ చేతివాటం, రాజకీయ నాయకులకు అడుగుల్లో మడుగులు, సిబిసిఐడితో విచారణ చేయించే యోచనలో ఎమ్మెల్యే యన్నం ?, డబ్బులు తిన్నవారికి, ఇచ్చిన వారికి గుండెల్లో గుబులు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో:  నిరుపేదలకు గూడు కల్పించాలన్న లక్షంతో గత సర్కార్ తీసు కొచ్చిన డబుల్ బెడ్‌రూం పథకం పాలమూరు జిల్లాలో అబాసు పాలైంది. అవినీతికి, అక్రమాలకు కేరాఫ్‌గా మారింది .గతంలోని బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన బడా రాజకీయ నేతలు,కొందరు కౌన్సిలర్లు, మధ్య దళారులు కలిసి నిబంధనలను తుం గలో తొక్కిపట్టి లక్షల్లో కొల్లగొట్టినట్లు సర్వత్రా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నిజాయితీ గా ఉండాల్సిన మహబూబ్ నగర్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలోని ఓ అధికారి చక్రం తిప్పారు. డబుల్ బెడ్ రూంల వ్యవహారంలో చేతి వా టం ప్రదర్శించారు. అందినకాడికి దొబ్బుకున్నారు. లక్షల్లో వెనుకేసుకు న్నారు. బడా రాజకీయ నేత కనుసన్నల్లో ఉన్న ఈయన గారు కా ర్యాలయంను తమ గుప్పిట్లో పెట్టుకొని పని చేశారు. పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూంల వ్యవహారంలో డబ్బుల గోల్ మాల్ చేశారన్న సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

డబుల్ బెడ్ రూం లను తమ సొంత ఆస్తిలాగా ఓ రెవెన్యూ అధికారి ఎవరు డబ్బులు ఇస్తే వారికి పట్టా రాసిచ్చారు. ఈ విషయంలో పై అధికారులకు కూ డా కనీస సమాచారం ఇవ్వకుండా రాజకీయ నేతల అండ తనకు ఉందన్న అహంకారంతో ఈ దందాలకు పాల్పడినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే నెంబర్ 523లో పేదల ఇళ్ల పట్టాలను ఒక వైపు , మరో వైపు వీరన్నపేట,దివిటి పల్లి వద్ద ఉన్న డబుల్ బెడ్ రూం లను మార్కెట్ వస్తువుల్లాగా అమ్ముకున్నట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి.చివరికి పై అధికారులకు ఎన్ని సార్లు పిర్యాదులు చే సినా చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చం దంగానే డబుల్‌బెడ్ రూంల అక్రమాలు మిగిలిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 5200 డబుల్ రూంల ఇళ్లు పూర్తికాగా, జెజి గార్డన్ దగ్గర 672 డబుల్ బెడ్ రూంలు పూర్తి అయ్యాయి.

పేదల దరఖాస్తులు బుట్టదాఖలు???

డబుల్ బెడ్‌రూం మంజూరు కోసం వేలాది మంది పేదలు దరఖాస్తులు చేసుకున్నారు. స ర్వే నెంబర్ 523లో పట్టాలు కోల్పోయిన వారి కి ఇస్తామని ఆర్‌డిఒ కార్యాలయంలో లబ్దిదారుల పేర్లు నోటీసు బోర్డుల్లో ప్రకటించారు. తర్వాత డిప్ ద్వారా సెలెక్ట్ చేస్తామని చెప్పించారు. చివరికి వీరిలో ఒకరికో,ఇద్దరికో ఇచ్చి మిగిలిన వాటిని చాల పకడ్చంధిగా విక్రయా లు చేయించుకున్నారు. మద్య దళారులు నియమించుకొని సగం అమౌంట్ ఇచ్చిన వారికి పట్టా జిరాక్స్ చేతిలో పెట్టడం, అమౌంట్ పూర్తి గా చెల్లించిన తర్వాత ఒరిజినల్ పట్టా ఇవ్వడం చేసినట్లు తెలుస్తోంది. అందులోనూ రోడ్ ఇళ్లు, తూర్పుఫేస్ ఇంటికి కాస్త అమ్యాయాలు ఎక్కువ చెల్లించిన వారికి కేటాయించారన్నఆరోపణలు ఉన్నాయి., ఈ లెక్కన కోట్లల్లోనే అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఎంపికలో పారదర్శకతకు పాతరేసి ఇష్టానుసారం ఎంపిక చేశారు ముఖ్యరాజకీయ నేతలు సిఫార్స్ చేసిన వారికి చేతిలో పట్టా పెట్టారని చెబుతున్నారు. నిజమైన పేదలకు డబుల్ బెడ్ రూం ఒక కళగానే మిగిలిపోయిందన్న చర్చ జరుగుతోంది.ఈ వ్యవహార విషయంలోనే పాపం ఒక రెవెన్యూ అధికారి కుమారుడిని కూడా బలి తీసుకునేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరో చేసిన పాపానికి ఒక యువకుడు బలి కావడం అప్పట్లో తీవ్ర సంచలనం అయ్యింది . అయినప్పటికీ ఈ డబుల్ బెడ్ రూంల అవినీతిపై విచారణకు ఏ నాయకుడు, అధికారి ఆదేశించలేక పోయారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆల్‌రెడి ఇళ్లు ఉన్నవారికి, ఇతర జిల్లాల వారికి ఇళ్ల కేటాయింపు జరిగినట్లు సమాచారం.

అవినీతి పరుల గుండెల్లో రైళ్లు:

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్ని అవినీతి అక్రమాలతో పాటు డబుల్ బెడ్ రూం అక్రమాలపై కూడా విచారణ చేయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 523లో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇచ్చిన ఇంటి పట్టాలు ఎన్ని,లబ్దిదారులు పేర్లు, 2014 నుంచి 2023 వరకు మంజూరైన డుబల్ బెడ్ రూంల లబ్దిదారుల జాబితా కూడా తెప్పిచుకునే పయత్నంలో ఉన్నారు. వీటిపై పూర్తిగా విచారణ చేయించి అవసరమైతే ఆర్‌ఆర్ యాక్ట్ ప్రయోగించడమా, లేక క్రిమినల్ చర్యలు తీసుకోవడమా ఇందులో ఎదో కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. డబుల్ బెడ్ రూంల ఎంపికలలో తీసుకున్న ప్రాతిపదిక ఏమిటి? ఆచరణలో జరిగిన విదానం ఏమిటన్నది కూడా విచారించనున్నారు. అవసరమైతే సిబిసిఐడికి కూడా అప్పగించాలనే ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. దీంతో డబుల్ బెడ్ రూంల వ్యవహారంలో డబ్బులు ఇచ్చిన వారిలోనూ, తీసుకున్న వారి గుండెల్లో అలజడి మొదలైంది. ఎప్పుడు విచారణ జరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News