హైదరాబాద్: గత 50 సంవత్సరాల నుంచి నివాసం ఉన్న వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లిఫ్ట్ సౌకర్యంతో జి ప్లస్ 5 పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని గొల్ల కొమరయ్యనగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారుల చేత మంత్రులు మహమూద్ అలీ, తలసాని గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. నియోజక వర్గంలో స్థలం లేకపోవడంతో ఇండ్లు నిర్మించలేకపోతున్నామన్నారు. ఖాళీ స్థలాలు ఉన్న చోటు పక్కగా ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గొల్ల కొమరయ్యనగర్ లో మంచి కమూనిటీ హాల్ ఉందన్నారు. కాలనీలో సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
గొల్ల కొమరయ్యనగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభం…
- Advertisement -
- Advertisement -
- Advertisement -