Monday, December 23, 2024

పద్మశాలి పేదలకు డబుల్ బెడ్ రూంలు అందిస్తాం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి దయనంద్ గార్డెన్ లో సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య, ఆర్ధికమంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… రాష్ట్ర కార్యవర్గం ఏ విధంగా వస్తారో.. అదే విధంగా జిల్లా కార్యవర్గానికి పద్మశాలి సమాజ ప్రజలు తరలి వచ్చారని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం పరితపించే అధ్యక్షులు డాక్టర్ సతీష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పద్మశాలి పేదలకు డబల్ బెడ్ రూమ్ లు అందిస్తామన్నారు. పద్మశాలీలు రాజకీయంగా, ఆర్ధికంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ పద్మశాలీ సమాజం కోసం పరితపించే గొప్ప వ్యక్తిని కొనియాడారు. పద్మశాలి సమాజం కోసం ఉద్యమించిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలి సమాజం అభివృద్ధి కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. పద్మశాలిలా కోసం ప్రభుత్వ తరుపున రావాలిసిన సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News