మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. గుడ్ మార్నింగ్ నాగర్‌కర్నూల్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని పుల్జాల గ్రామంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇల్లు, నూతన సిసి రోడ్లు, ఆసరా ఫించన్లు, ధరణి సమస్యలు, నూతన బ్రిడ్జిలు, గ్రామానికి బస్సు సౌకర్యం తదితర సమస్యలను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని కోరగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆసరా ఫించన్ వచ్చేలా కృషి చేస్తానని, ధరణి సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఎవరు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.
అదే విధంగా నూతన సిసి రోడ్లు నిర్మాణం, పేదలకు త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని అన్నారు. పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేను కోరగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఆర్టిసి డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి పుల్జాల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. అదే విధంగా పుల్జాల నుండి కార్వంగ గ్రామాల వరకు బ్రిడ్జిని, మల్కాపూర్ వాగు బ్రిడ్జిని త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తానని గ్రామస్తులకు హామి ఇచ్చారు. పంట పొలాలకు వెళ్లే రైతులకు నక్షబాట ఉంటే తన దృష్టికి తీసుకువస్తే బాట సౌకర్యం కల్పిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సత్తవరం నరసింహ రెడ్డి, జెడ్పిటిసి చిక్కొండ్ర శ్రీశైలం, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాధవ రెడ్డి, గ్రామ ఎంపిటిసి నిర్మల వెంకట్ రెడ్డి, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు.
Double bedrooms will handover to poor: MLA Marri Janardhan Reddy