Friday, December 27, 2024

వనపర్తిలో డబుల్ సంబరం

- Advertisement -
- Advertisement -

వనపర్తి : అర్హులైన వారికే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు డబుల బెడ్ రూం ఇండ్ల పట్టాలు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జెడ్పి చైర్మెన్ లోక్‌నాథ్ రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. వనపర్తి పట్టణంలో 1259 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించగా మంగళవారం 543 మందికి పంపిణీ చేయడం జరిగి ందన్నారు.

వనపర్తి నియోజకవర్గానికి మొత్తం 2900 గృహాలు వచ్చాయని, కొన్ని పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇవికాక మరో 300 ఇండ్లు మరి కొద్ది కాలంలో పూర్తవుతాయన్నారు. దశల వారిగా అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామన్నారు. సొంత స్థలం ఉన్న వారికి గృహ లక్ష్మి పథకం అందిస్తామన్నారు.

ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి పేదలకు ప్లాట్లు కేటాయిస్తామని, దానికి సంబంధించిన సర్వే నడుస్తుందన్నారు. వీలైనంత ఎక్కువ మంది అర్హులైన పేదలను సాయం అందాలన్నదే తన ఆకాంక్షఅని అన్నారు. అందరు తమకు కేటాయించిన ఇండ్లలో సంతోషంగా జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News