ఒకప్పుడు వన్డేలలో సెంచరీలు చేయడమే గగనంగా మారిపోయేది. ఇప్పుడు డబుల్ సెంచరీలు అలవోకగా చేస్తున్నారు. తాజాగా యంగ్ ప్లేయర్లు బంగ్లాదేశ్‌పై ఇషాన్ కిషన్, న్యూజిలాండ్‌పై శుభ్‌మన్‌గిల్ డబుల్ సెంచరీలు చేశారు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యధికంగా పరుగులు చేసిన రికార్డు కూడా రోహిత్ శర్మ (264) పేరు పైనే ఉంది. తొలి డబుల్ సెంచరీ చేసిన రికార్డు మాత్రం సచిన్ టెండూల్కర్ పైనా ఉంది. 2010లో దక్షిణాఫ్రికాపై సచిన్ డబుల్ సెంచరీ చేశాడు. భారత్ నుంచి ఐదుగురు క్రికెటర్లు డబుల్ సెంచరీలు చేశారు. ఇప్పటివరకు అంతర్జాతీయంగా పది డబుల్ సెంచరీల నమోదయ్యాయి. భారత్ నుంచి ఏడు, పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్ నుంచి ఒక్కొక్క డబుల్ సెంచరీ నమోదయ్యాయి.
టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్(200), వీరేంద్ర సెహ్వాగ్(219) రోహిత్ శర్మ(264,209,208), ఇసాన్ కిషన్ (210), శుభమన్ గిల్(208) డబుల్ సెంచరీలు చేశారు. వీదేశీ క్రికెటర్ల న్యూజిలాండ్ నుంచి మార్టిన్ గుప్తిల్(237), వెస్టిండీస్ నుంచి క్రిస్ గ్రేల్ (215), పాకిస్థాన్ నుంచి ఫఖర్ జమాన్ (210) డబుల్ సెంచరీలు చేశారు.య