Thursday, January 23, 2025

అంగడి వేలంలో రెట్టింపు వసూలు

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్ : 2023 సంవత్సరానికి సంబంధించి హుస్నాబాద్ అంగడి వేలం సుమారు రూ. 78 లక్షలకు గుత్తేదారు దక్కించుకోవడం తెలిసిందే. అంగడి పాట అధికం అయిందంటూ నిర్నీత ధరల కంటే రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నట్లు సమాచారం కాగా శనివారం అంగడి వేలం ధర అధికం అయిందని ఇష్టానుసారంగా సంబంధించిన కాంట్రాక్టర్ సంతలో వ్యాపారులు, రైతులు, హోటల్ , పనిముట్లు అమ్ముకునే వ్యాపారులు ముఖ్యంగా పార్కింగ్ పేరిట రె ట్టింపు వసూలు చేస్తున్నట్లు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నియోజక వర్గ కన్వీనర్ పచ్చిమట్ల ర వీందర్ గౌడ్ ఆరోపించారు.

మున్సిపల్ పాలక వర్గం, అధికారుల పర్యవేక్షణ లేమి సదర్ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా మున్సిపల్ నిర్ణయించిన ధరల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారని తెలిపారు. అధికారులు నిర్ణయించిన ధర కర పత్రం ఒకరకంగా , అంగడిలో వసూలు చేసే ధర వేరే రకంగా ఉండడం మున్సిపల్ పర్యవేక్షణ నిర్లక్షంకు నిదర్శనమనానరు. దాదాపు మూడు నాలుగు జిల్లాల నుండి వ్యాపారులు రైతులు సంతకు రావడం జరుగుతుందని సంతలో అధిక ధరలు వసూలు చేయడంతో నష్టపోతున్నట్లు వెల్లడించారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు అంగడిలో గుత్తె దారుల దోపిడి ఆరికట్టాలని లేని పక్షంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News