Wednesday, January 22, 2025

కారును ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. ఏడుగురు మృతి, 20మందికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో డబుల్ డెక్కర్ బస్సు కారును ఢీకొనడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. బస్సు రాయబరెల్లి నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై ఎస్‌ఎస్పీ ఇటావా సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. “రాయ్‌బరేలీ నుంచి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కారును ఢీకొట్టింది. బస్సులో 60 మంది ఉన్నారు. వారిలో 4 మంది మరణించారు. 20 నుంచి 25 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు. కారులో ఉన్న ముగ్గురు కూడా చనిపోయారు” అని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News