Monday, December 23, 2024

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : తెలంగాణ రాష్ట్రంలో రానున్నది డబుల్ ఇంజన్ సర్కార్ అని ఈశాన్య రాష్ట్రాల శాఖ కేంద్ర సహయ మంత్రి బిఎల్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం స్ధానిక రామ్‌దేవ్‌బాబా మందిరంలో నిర్వహించిన మహజన్ సంపర్క్ యోజనలో భాగంగా సంయుక్త మోర్చాల సమావేశానికి ముఖ్యఅతిధిగా హజరై మాట్లాడారు.

కేంద్రంలో నరేంద్రమోడి పేదప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని దేశవ్యాప్తంగా మోడి గాలి వీస్తుందన్నారు. అభివృద్ధి ఓర్వలేని బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మోడి పధకాలపై బురద జల్లుతుందన్నారు. రాష్ట్రంలో పూర్తిగా కుటుంబపాలన కొనసాగుతుందని వారిని గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. నరేంద్రమోడి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొస్తామన్నారు.

ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, జిల్లా ఇంచార్జ్ రాకేష్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గుగులోత్ రాంచంద్రనాయక్, జిల్లా నాయకులు నాళ్ళ సోమసుందర్, నియోజకవర్గ ఇంచార్జ్ బాలగాని గోపికృష్ణ, మైనార్టీ మోర్చా జిల్లా నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News