Thursday, January 23, 2025

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం :తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని ఇందులో ఏమాత్రం అనుమానం లేదని కేంద్ర సహకార శాఖ మంత్రి బిఎల్.వర్మ దీమా వ్యక్తం చేశారు. జనసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం ఖమ్మం రూరల్ మండంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మారేమ్మ గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఖమ్మం నగరంలో ఇటీవల రెండో షాదిఖానా కోసం శంకుస్దాపన చేసిన స్థలాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో ఆయన ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాటాడుతూ గతంలో గోశాలకు కేటాయించిన సీక్వెల్ సమీపంలోని స్థలాన్ని ప్రస్తుతం రెండో షాదీఖానాకు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత షాదిఖానకు కేటాయించిన స్ధలాన్ని రద్దు చేస్తామన్నారు. తొమ్మిదేళ్ళ బిజెపి పాలనలో దేశ ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పధఖాలను తీసుకొచ్చారన్నారు. పిఎం అవాస్ యోజన పథకం ద్వారా దేశంలో నాలుగు కోట్ల ఇళ్లనిర్మాణం చేపట్టామని తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ దానిని డబుల్ బెడ్ రూం పథకంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు దేశంలో 48 కోట్ల జనధన్ ఖాతాల్లో బటన్ నొక్కగానే పేదలందరికి కేంద్ర సాయం జమ అవుతుందన్నారు.

ఉజ్వలయోజన ద్వారా 9.6 కోట్ల గ్యాస్ కనేక్షన్లను అందించామన్నారు. భారత్ అయిష్మాన్ పధకం ద్వారారూ.5లక్షల విలువైన వైద్య సాయం ఉచితంగా అందిస్తున్నామన్నారు. కిసాన్ సన్మాన్ నినధి ద్వారా 11.5 కోట్ల రైతుల ఖాతాల్లో 2 లక్షల 42 కోట్ల నిధులు జమ అయ్యాయని ఆయనచెప్పారు. దళారులు, పైరవీకారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయన్నారు. ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులు విస్తరించామని, ఖమ్మం జిల్లాలో పదివేల కోట్ల వ్యయంతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. 9 ఏళ్లలో 3 లక్షల 75వేల కి.మీ ఫోర్ లైన్ రోడ్లను నిర్మించామన్నారు. 250 కీ మీ వరకు మెట్రో సేవలను విస్తరించామని ఆయన తెలపారు.

దేశంలో గడిచిన 9 ఏళ్ళలో390 మెడికల్ కళాశాలలను ప్రారంభించామన్నారు. ప్రసాద్ పధకం ద్వారా దేవాలయాలను అధునీకరిస్తున్నామన్నారు. ఈవిలేఖర్ల సమావేశంలో రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, బిజెపి జిల్లా నాయకులు ఉప్పల శారద, అల్లిక అంజయ్య, రుద్ర ప్రదీప్, నున్న నరేశ్, కొల్లిపాక శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News