Monday, December 23, 2024

అప్పుల ఊబిలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో (డబుల్ ఇంజిన్ సర్కార్) ఉంటే అ భివృద్ధి పరుగులు పెడుతుందనే వాదనల్లో పసలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అధ్యయనాలు స్పష్టం. బిజెపి పాలనలో ఉన్న 17 రాష్ట్రాల్లో అస్సాం, మహారాష్ట్రలు మినహా మిగతా 15 రాష్ట్రాలూ, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పీకల్లోతు అ ప్పుల్లో కూరుకుపోయాయి. సబ్సిడీలు, ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని విమర్శించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హ ర్యానా, కర్ణాటక తదితర రాష్ట్రాల జిడిపి లో నిబంధనలకు విరుద్ధంగా 10 శాతానికి పైగా ఉచితాలు, సబ్సిడీలు అమ లు చేస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో జిడిపిలో ఈ సంక్షేమ పథకాలకు పెడుతు న్న ఖర్చంతా 10శాతానికి లో బడే ఉన్నాయని ఆర్‌బిఐ నివేదిక స్పష్టం చేసింది. చేసిన రాష్ట్రాల్లో పంజాబ్ 53.3 శాతంతో దేశంలోని అన్ని రా ష్ట్రాల్లో కంటే అగ్రస్థానంలో నిలిచింది.

కానీ ఈశా న్య రాష్ట్రమైన అస్సాం అప్పులు 14 శాతానికే పరిమితమై చివరి స్థానంలో నిలిచింది. అప్పులు చేసి పీకల్లోతు కష్టాల్లో పది రాష్ట్రాలు ఉన్నాయని, అం దులో పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ 41 శాతం, రా జస్థాన్ (39.8శాతం), బీహార్ 38.6 శాతం, మణిపూర్ 37.92 శాతం, కేరళ 37 శాతం, ఉత్తరప్రదేశ్ 34.9 శాతం, పశ్చిమ బెంగాల్ 34.4 శాతం, ఝార్ఖండ్ 33 శాతం, ఆంధ్రప్రదేశ్ 33 శాతం, మేఘాలయ 32%, మధ్యప్రదేశ్ 31.3 శాతం, హ ర్యానా 29.4%, తమిళనాడు 27.4%, గోవా 27%, కర్ణాటక 26.6%, చత్తీస్‌గఢ్ 26.2, మహారాష్ట్ర 17.84% మేరకు అప్పులు చేశాయి. అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన రాష్ట్రాల జాబితాలో తె లంగాణ రాష్ట్రం లేదని ఆర్‌బిఐ నివేదిక స్పష్టం చేస్తున్నది. 2022-23వ ఆర్థ్ధిక సంవత్సరం ప్రారంభంలో 24.7 శాతం ఉన్న అప్పులు కాస్తా నవంబర్ నెలాఖరు నాటికి 19 శాతానికి పడిపోయాయి.

ఎందుకంటే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టంలో మార్పులు, చేర్పులు చేసి కొత్త నిబంధనల పేరుతో తెలంగాణకు రుణాలను సేకరించుకోవడానికి కేంద్రం అడుగడుగునా అడ్డుపుల్లలు వేయడంతోనే అప్పుల శాతాలు గణనీయంగా తగ్గాయి. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం దేశం యావత్తూ 60 శాతం మాత్రమే అప్పులు చేయాలని, అందులో కేంద్రం 40 శాతం మేరకు అప్పులు తెచ్చుకోవచ్చునని, మిగిలిన 20 శాతం వరకూ రాష్ట్రాలు అప్పులు చేసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వమే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి 84 శాతం వరకూ అప్పులు తెచ్చింది. ప్రస్తుతం దేశం అప్పులు రూ.152,17,910 కోట్లు ఉంది. దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు మాత్రమే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి లోబడి నడుచుకొంటున్నాయి. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం పది రాష్ట్రాలు అప్పుల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అందులో పంజాబ్, రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలున్నాయి.

ఈ పది రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉందని ఆర్‌బిఐ నివేదిక స్పష్టం చేస్తోంది. మరీ ముఖ్యంగా బీహార్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలైతే రికార్డుస్థాయిలో అప్పులు తెచ్చుకునే పరిధులు, ద్రవ్యలోటు పరిధులను కూడా దాటిపోయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. అయిదు రాష్ట్రాలు ఆర్థికంగా ‘హైలీ స్ట్రెస్’ను ఎదుర్కొంటున్న రాష్ట్రాలని ఆర్‌బిఐ నివేదికలో పేర్కొంది. ఆర్థిక సూత్రాలు, బడ్జెట్ నిర్వహణ, ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల మేరకు ఏ రాష్ట్రమైనా సొంత ఆదాయాల్లో పది శాతానికి మించకుండా సబ్సిడీలు, ఉచిత పథకాలను అమలు చేసుకోవచ్చునని, కానీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పది శాతానికి మించిన స్థాయిలో నిధులను ఉచితాలు, సబ్సిడీలపై ఖర్చు చేస్తున్నాయని ఆర్‌బిఐ నిగ్గు తేల్చింది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జాతీయస్థాయిలో రికార్డు సృష్టించిన అనేక సంక్షేమలున్నప్పటికీ వాటికి ఖర్చు చేసే నిధులన్నీ పది శాతానికి లోబడే ఉన్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉచితాలు, సబ్సిడీపై ఏకంగా పది పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాల కోసం ఈ ఏడాది రూ.27,541 కోట్లను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆర్‌బిఐ నివేదిక పేర్కొంది. ఈ నిధులు ఆ రాష్ట్ర జిడిపిలో 2.1 శాతం కాగా, రెవెన్యూ రాబడుల్లో 14.4 శాతం నిధులు ఖర్చు అవుతున్నాయని, రాష్ట్ర ఖజానాకు వచ్చే సొంత ఆదాయంలో నుంచి 30.3 శాతం నిధులను ఎపి ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆర్‌బిఐ స్పష్టం చేస్తున్నది. ఇలా ఎన్‌డిఎ పాలనలో ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నాయి. ఇక డబుల్ ఇంజన్ రాష్ట్రాలన్నీ (అస్సాం, మహారాష్ట్ర మినహా) పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి లేకపోవడం, ఐటి రంగానికి రాజధానిగా విలసిల్లిన కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణ వంటి రాష్ట్రాలకు తరలి వెళ్తుండగంతో డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధి మందగించింది. పారిశ్రామిక రంగం ఒక్క మహారాష్ట్రలో తప్ప మిగతా బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేదని, గుజరాత్, యుపి, హర్యానా వంటి రాష్ట్రాల్లోని బిలియనీర్లు విదేశాలకు పారిపోతున్నందున కూడా ఆ రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధి జరగడంలేదు. అదే తెలంగాణ రాష్ట్రం విషయానికొచ్చేసరికి ఇక్కడ ఐటి రంగానికే కాకుండా ఫార్మా, పరిశ్రమల రంగాలకు అవసరమైన సకల సదుపాయాలను అనేక రాయితీలతో ఇస్తుండడంతోనే పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.

పరిశ్రమలకు అవసరమైన భూమి, నదీ జలాలు, నాణ్యమైన విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ ఇలా ఒక్కటేమిటీ పెట్టుబడిదారులకు అవసరమైన సకల సదుపాయాలను కల్పిస్తుండటంతోనే తెలంగాణలో ఆర్థ్ధికాభివృద్ధి డబుల్ ఇంజన్ రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. అందుకే కేంద్రం సహకరించకుండా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా సొంత ఆదాయంతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించగలుగుతున్నామని తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా చాటి చెబుతున్నది. రైతు సంక్షేమ పథకాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు, దళితబంధు వంటి సంక్షేమ పథకాలను కాపీ కొట్టడానికే పరిమితం కాకుండా తెలంగాణలో అమలవుతున్న ఆర్ధిక విధానాలు, సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కూడా డబుల్ ఇంజన్ రాష్ట్రాలు ఆచరిస్తే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News