మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : ‘డబుల్ గ్రోత్…ఇది నా గ్యారంటీ’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు సమీపంలోని పటేల్ గూడ వద్ద రూ.9021 కో ట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో ఆయన ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు..’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇది దేశంలోనే మొదటదని వెల్లడించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు వికసిత్ భారత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. వికసిత్ భారత్ కోసం మౌలిక సౌకర్యాల కల్పన ఆవశ్యకమని చెప్పారు. మౌలిక సౌకర్యాల కోసం బడ్జెట్‌లో రూ.11 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడించారు. సంగారెడ్డి నుంచి మదీనగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామ ని తెలిపారు. దీనిద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య అనుసంధానత ఏర్పడుతుందన్నారు. దక్షిణ భారత్‌కు గేట్‌వేలా తెలంగాణ నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో బిజెపి పట్ల ఆదరణ పెరుగుతోందని, మీ ఆశీర్వాదాలు వృ థా కానివ్వనని, ఇది మోడీ గ్యారంటీ అని ఆ యన అన్నారు. మోడీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతారని, మోడీ గ్యారంటీ అంటే ఇచ్చిన హామీని నెరవేర్చే గ్యారంటీ అని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చే ర్చాలని, ఇప్పటికే ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా ఉన్నదని, ప్రపంచ దేశాల్లో తెలుగువా ళ్లు కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు. తా ము ఇచ్చిన మాట ప్రకారం 370 ఆర్టికల్‌ను రద్దు చేశామని, ప్రపంచం గర్వించే రీతిలో అ యోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాన జరిగింద ని అన్నారు. ‘ఇవాళ మీ అందరికీ ఒక గ్యారంటీ ఇస్తున్నా.. రాసుకోండి.. ప్రపంచంలో భారతదేశాన్ని మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం’ అని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో వారి కుటుంబాలే బాగుపడ్డాయని, దేశం బాగుపడలేదని విమర్శించారు. కుటుంబ వాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని, కుటుంబ వాదులకు దోపిడీ చేసే లైసెన్సు ఉన్నదా అని ప్రశ్నించారు. తనకు కుటుంబమే లేదని కొందరు విమర్శిస్తున్నారని, అలాంటి వారికి వారి కుటుంబమే ముఖ్యం..అదే తనకు దేశమే ముఖ్యం అని మోడీ పేర్కొన్నారు. వారు దేశంలో అనేక మందిని రాజకీయంగా ఎదగనివ్వలేదని, యువకులకు కాకుండా వృద్ధులకే వారు అవకామిచ్చారని, యువకులు వస్తే తమకు పోటీ అవుతారన్న భయం వారిలో ఉందన్నారు. కుటుబ వాదులు, కొందరు గిఫ్టులు తీసుకుని ఖజానా నింపుకుంటున్నారని, వారి దొంగ సొత్తును బయటికు కక్కిస్తున్నామన్నారు. కొందరు నల్లధనం దాచుకోవడానికి విదీశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారన్నారు. ఓ వర్గం వారు తమ కుటుంబాలకు విలాసవంతమైన భవంతులను కట్టించారని, తాము మాత్రం దేశంలో నాలుగు కోట్ల మందికి ఇండ్లు కట్టించామన్నారు. దేశంలోని ప్రతి తల్లి, చెల్లి తన కుటుంబమేనని, కానీ ఇండియా కూటమికి ఇది అర్థం కావడం లేదన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయకపోయినప్పటికీ, కుటుంబ పాలనపై ప్రశ్నించినందుకు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబంలో 50 మందికి పైగా దోచుకున్నారని, ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. మోడీపై యుద్ధానికి దిగుతున్నామని వారంటున్నారని, మోడీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. మాదిగ రిజర్వేషన్లకోసం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో దళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని, నాణేనికి బొమ్మా బొరుసు లాంటివన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లను బిఆర్‌ఎస్ దోచుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కొత్త ఎటిఎంలా మార్చుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బిఆర్‌ఎస్ కుంభకోణానికి పాల్పడితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోకుండా ఫైలును మూసేసిందన్నారు. ఆ రెండు పార్టీలది ఒకటే బాట అని జూట్..లూఠ్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌కు కవర్ ఫైర్ చేస్తోందని, అది ఎక్కువ రోజులు నిలవదన్నారు. కేంద్రంలో బిజెపి ఉంటే సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందని, ఎయిర్‌స్ట్రైక్ కూడా జరుగుతుందని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిపించడమే లక్షంగా బిజెపి శ్రేణులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బిజెపి ఎల్‌పి నేత మహేశ్వర్‌రెడ్డి, ఎంఎల్‌ఎ వెంకటరమణారెడ్డి, ఎంపి బిబి పాటిల్, సీనియర్ నాయకుడు ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్, రఘునందర్‌రావు, నందీశ్వర్‌గౌడ్, బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.