Thursday, January 23, 2025

పెట్టుబడులు డబుల్

- Advertisement -
- Advertisement -

అధికారంలోకి మళ్లీ మేమే వస్తాం.. మరిన్ని సిఐఐ సదస్సులు నిర్వహిస్తాం

లైఫ్ సైన్సెస్ రంగంలో
విస్తృత అవకాశాలు
2030 నాటికి 250 బిలియన్
డాలర్ల పెట్టుబడుల సాధనే లక్షం
సిఐఐ తెలంగాణ వార్షిక
సమావేశంలో మంత్రి కెటిఆర్
విదేశీ కంపెనీలకు గమ్యస్థానంగా
తెలంగాణ: భారత్ బయోటెక్
ఎండి సుచిత్ర ఎల్లా

మనతెలంగాణ/హైదరాబాద్: పెట్టుబడులకు రాష్ట్రంలో అనువైన వాతావరణం ఉం దని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి తామే వస్తామని మరిన్ని సిఐఐ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి కెటిఆర్ పే ర్కొన్నారు. బేగంపేటలోని ఐటిసి కాకతీయలో ఏర్పాటు చేసిన భారతీయ పరిశ్రమ సమాఖ్య (సిఐఐ) తెలంగాణ వార్షిక సమావేశానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటీవల బ యో ఏషియా సదస్సును విజయవంతం గా నిర్వహించుకున్నామని, లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో ఇప్పుడు పె ట్టుబడులు రెట్టింపు అయ్యాయనితెలిపా రు.

2030 నాటికి 250 బిలియన్ డాలర్లు పెట్టుబడులను సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని ఆయన స్పష్టం చే శారు. నగరానికి ఎన్నో అనుకూలతలు, బ లాలు ఉన్నాయన్నారు. 9 బిలియన్ టీకాలు  హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారు అవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన డివైజెస్ పార్కులోనే ఉందని, తెలంగాణలో అతి పెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. దేశానికే హైదరాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

ప్రపంచ దిగ్గజ కంపెనీల అతి పెద్ద ప్రాంగణాలు హైదరాబాద్‌లోనే….

హైదరాబాద్ అత్యుత్తమ వేదిక ఉండాలన్న ఉద్ధేశ్యంతో ఫార్మా పరిశ్రమలకు ఒకే చోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సుల్తాన్‌పూర్ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు చేశామని కెటిఆర్ తెలిపారు. లైఫ్ సైన్స్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందన్నారు. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటగా హైదరాబాద్‌లోనే జరిగిందన్నారు. ప్రైవేటుగా రాకెట్ లాంచింగ్ చేసిన స్కైరూట్ ప్రతినిధులకు కెటిఆర్ అభినందనలు తెలిపారు. డ్రోన్‌ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే వినూత్న కార్యక్రమం చేపట్టామని కెటిఆర్ చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ కంపెనీలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో అతి పెద్ద ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నాయని ఆయన వివరించారు.

విభిన్న కంపెనీలు మాత్రమే కాదనీ, విభిన్నమైన ఆచారాలు, ఆహారం కూడా హైదరాబాద్‌లో కనిపిస్తుందన్నారు. ఎలక్ట్రిక్ వాహన రం గంలో విప్లవాత్మక మార్పులు, ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కెటిఆర్ తెలిపారు. ముందుచూపుతో ఈవీ, బ్యాటరీల తయారీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణ పత్తికి దేశంలో మంచి డిమాండ్ ఏర్పడిందని, టెక్స్‌టైల్స్ రంగంలోనూ పెట్టుబడులకు విస్తృత పరిధి ఉందన్నారు. భారీ స్థాయిలో కాకతీయ టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. ఫాక్స్‌కాన్ సంస్థకు 200 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉండే పరిశ్రమలకు నీటి సమస్య కూడా లేదని కెటిఆర్ స్పష్టం చేశారు.

విదేశీ కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ: బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్ల

విదేశీ కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ మారిందని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల పేర్కొన్నారు. సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడా రు. తెలంగాణకు పెట్టుబడుల కోసం మంత్రి కెటిఆర్ కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం సాధిస్తున్న వృద్ధి వల్లే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం బాగుందన్నారు. తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలో టిఎస్ ఐపాస్ ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం బాగుందని, ఇది తనకు చాలా నచ్చిందని ఆమె ప్రశంసించారు.

ఆవిష్కరణలను ప్రోత్సహించే టి హబ్ మంచి ఆలోచన అని ఆమె కితాబునిచ్చారు. పునరుత్పాదక రంగంలో పరిశ్రమలను ప్రభు త్వం ప్రోత్సహిస్తోందని, విదేశీ కంపెనీలకు దక్షిణాది రాష్ట్రా లు గమ్యస్థానంగా ఉన్నాయని సుచిత్ర ఎల్ల పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి పెద్ద ఎత్తున హరితహారం పేరుతో మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సుచిత్ర ఎల్ల వ్యాఖ్యానించారు. పునరుత్పాదక శక్తి రంగంలో పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలో ఏ మూలన విదేశీ కంపెనీలు పెట్టాలన్నా దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా ఉండ డం శుభసూచికమని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News