Thursday, July 4, 2024

డబుల్ ఇస్మార్ట్ నుంచి మాస్ సాంగ్ విడుదల…. అదిరిపోయింది

- Advertisement -
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత టీం ఇప్పుడు ఫస్ట్ సింగిల్ స్టెప్ మార్‌తో మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించింది. స్టెప్ మార్… ట్రూలీ మాస్ డ్యాన్స్, రిథమ్, హై ఎనర్జీని సెలబ్రేట్ చేసుకునే సాంగ్.

ఉస్తాద్ రామ్ పోతినేని అద్భుతమైన పర్ఫార్మెన్స్, పూరి జగన్నాధ్ స్టైలిష్ టేక్ విజువల్ మాస్ ఫీస్ట్ లా వుంది. వోకల్స్, లిరిక్స్ శ్రోతలకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చాయి. స్టెప్ మార్ మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్. ఇది మ్యూజిక్ ప్రమోషన్‌లను అద్భుతంగా ప్రారంభించింది. భాస్కర భట్ల సాహిత్యం హీరో వైబ్‌ని గొప్పగా వర్ణిస్తుంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. అనురాగ్ కులకర్ణి, సాహితీ తమ డైనమిక్ వోకల్స్‌తో సాంగ్ కి మాస్ టచ్ జోడించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతమైన మూమెంట్స్‌తో మరొక హైలైట్. ఇందులో రామ్ పోతినేని డ్యాన్స్ మూమెంట్స్ ఆడియన్స్‌ని మైమరపిస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించగా, కావ్య థాపర్ హీరోయిన్. బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News