ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ మాసీవ్ బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌తో తిరిగి వస్తున్నారు. మేకర్స్ ఈరోజు సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదలకు ఇండిపెండెన్స్ డే పర్ఫెక్ట్ టైమ్. గురువారం సెలవు కాగా, సోమవారం (రక్షాబంధన్) మరో హాలీ డే కూడా సినిమాకు కలిసిరానుంది.
పవర్ ఫుల్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ పవర్-ప్యాక్డ్ అవతార్‌లో విభూతి ధరించి కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక శివలింగం, కాగడ ని చూడవచ్చు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ప్రీక్వెల్‌కి డబుల్ ఇస్మార్ట్ సినిమా డబుల్ మ్యాడ్‌నెస్‌తో ఉండబోతుంది. పూరి జగన్నాధ్ మరోసారి తన హీరోని బెస్ట్ స్టైలిష్, మాస్ యాక్షన్- ప్యాక్డ్ అవతార్‌లో చూపించారు. రామ్ డబుల్ ఇస్మార్ట్‌ని డబుల్ స్కిల్స్‌తో అదరగొట్టారు. సంజయ్ దత్ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్. పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.