Tuesday, January 21, 2025

హైదరాబాద్‌లో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్

- Advertisement -
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ మాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్‘ తో తిరిగి వస్తున్నారు. ఈ కొత్త వెంచర్ గ్రిప్పింగ్ స్టోరీలైన్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లతో అందరినీ అలరించనుంది. సంజయ్ దత్ విలన్‌గా చేరడం వలన స్టార్ పవర్ లేయర్‌ని యాడ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాస్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇది సినిమా విడుదలకు పర్ఫెక్ట్ టైం. 50 రోజుల కౌంట్‌డౌన్‌ను మార్కింగ్ చేస్తూ మేకర్స్ రామ్ పోతినేని స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

తన స్వాగ్, స్టైల్ తో శంకర్ పాత్రకు ప్రాణం పోశారు రామ్ పోతినేని. టైటిల్ సాంగ్ షూట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇది ప్రేక్షకులకు విజువల్, ఆడిటరీ ట్రీట్ ఉండేలా చూసేందుకు టీమ్ శ్రద్ధ తీసుకుంటోంది. పక్కా చార్ట్‌బస్టర్ అయ్యే ఈ పాటలో రామ్ పోతినేని సిగ్నేచర్ ఎనర్జిటిక్ స్టైల్‌లో ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూవ్‌లు, విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. మణిశర్మ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ మాస్ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో సాంగ్ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో రామ్‌కు జోడిగా కావ్య థాపర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్ట్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News