Monday, January 20, 2025

గెట్ రెడీ.. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీజర్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ను వదిలారు మేకర్స్. ఈ సినిమా టీజర్‌ ను మే 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం పోస్టర్‌ ను వదిలారు. దీంతో టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను పూరిజగన్నాథ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ ను మేకర్స్ రీసెంట్ గా ప్రారంభించారు. త్వరలోనే విడుదల చిత్రీకరణ పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News