Thursday, January 23, 2025

రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని తన అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. బుధవారం రామ్ పుట్టిన రోజు సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ మూవీ టీజర్ ను తెలుగుతోపాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు. ఊర మాస్ గా ఉన్న ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదిరిపోయింది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించడంతోపాటు చార్మీతో కలిసి స్వయంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News