Thursday, December 19, 2024

‘డబుల్ ఇస్మార్ట్’ షురూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్తాద్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ ’ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ’డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఘనంగా ప్రారంభమైంది. పూరి కనెక్ట్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమా ప్రారంభ వేడుకలో ఛార్మి క్లాప్ ఇవ్వగా, హీరో రామ్ పోతినేనిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి స్వయంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశంలో ‘ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అని రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

‘డబుల్ ది ఎంటర్‌టైన్‌మెంట్! డబుల్ ది యాక్షన్! డబల్ ది మ్యాడ్‌నెస్! వి ఆర్ బ్యాక్ !! #డబుల్ ఇస్మార్ట్ మోడ్ ఆన్! ‘ అంటూ లాంచింగ్ ఈవెంట్ లో ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేశారు రామ్. డబుల్ ఇస్మార్ట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 8న మహా శివరాత్రికి విడుదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News