లండన్: క్వీన్ ఎలిజబెత్ మరణాన్ని ప్రకటించిన కొన్ని నిమిషాల తర్వాత బకింగ్‌హామ్ ప్యాలెస్‌పై రెండు ఇంద్రధనస్సులు(డబుల్ రెయిన్‌బో) కనిపించాయి. బ్రిటన్‌ను అత్యధిక కాలం పాలించిన మహారాణి 96 ఏళ్ల వయసులో గురువారం సాయంత్రం కన్నుమూశారు. క్వీన్ ఎలిజబెత్ II మరణ ప్రకటన తర్వాత బ్రిటీష్ జెండా సగం అవతనం చేశారు. లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ వెలుపల సంతాపకులు గుమిగూడినప్పుడు, పై ఆకాశంలో మెరిసే ఇంద్రధనస్సులు కనిపించాయి.
బెర్క్‌షైర్‌లోని ఇంగ్లీష్ కౌంటీలోని రాజ నివాసమైన విండ్సర్ కాజిల్‌పై కూడా ఇంద్రధనస్సు ఉద్భవించింది. చాలా మంది ఆంగ్లేయులకు రాణి మరణించిన రోజున ఇంద్రధనస్సులు హత్తుకునే ప్రతీకాత్మకత్మలుగా కనిపించాయి. క్వీన్ ఎలిజబెత్ గురువారం సాయంత్రం బాల్మోరల్‌లోని ఆమె స్కాటిష్ రిట్రీట్‌లో మరణించారు. “ఈ మధ్యాహ్నం బాల్మోరల్‌లో రాణి శాంతియుతంగా మరణించింది” అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఆమె మరణాన్ని ప్రకటిస్తూ ఒక ప్రకటన వెలువరించింది.