Wednesday, January 22, 2025

పెట్టుబడికి ‘డబుల్’ లాభం

- Advertisement -
- Advertisement -

నమ్మకానికి భరోసా మా సంస్థ
త్వరలో మూడు ప్రాజెక్టులు
యోషిత హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండి కమలాకర్

మనతెలంగాణ/ హైదరాబాద్ : రియల్‌ఎస్టేట్ రంగంలో ఎక్కువ మంది వినియోగదారులను సంపాదించుకోవడంతో వారి ఆదరాభిమానాల ను చూరగొనడంలో యోషిత హౌసింగ్ అండ్ ఇ న్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ ముందంజలో ఉందని ఆ సంస్థ ఎండి కమలాకర్ అన్నారు. ప్రజల పెట్టుబడిని రెండింతలు చేయడంతో పాటు వారి పెట్టుబడులకు భరోసా కల్పించేలా యోషిత చర్యలు చేపట్టిందన్నారు. రెండేళ్ల కాలంలో సుమారు 2 వేల మంది కస్టమర్లను 4 వేల మంది మెంబర్స్ ను సంపాదించుకొని, ఈ రెండు సంవత్సరాల్లో 6 అప్రూవ్డ్ (డిటిసిపి, హెచ్‌ఎండిఏ) లే ఔట్‌లను చేపట్టడంతో పాటు వాటిని విజయవంతంగా డె వలప్ చేసి విక్రయించి వినియోగదారుల మెప్పు పొందిందన్నారు. త్వరలో మరో మూడు ప్రాజెక్టులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయ ని, ఈ సందర్భంగా యోషిత హౌసింగ్ అండ్ ఇ న్‌ఫ్రా డెవలపర్స్ ఎండి కమలాకర్ ‘మనతెలంగాణ’తో తన అనుభవాలు, కొత్త వెంచర్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఈ విషయాల గురించి ఆయన మాటల్లోనే.

మార్కెట్ టీం, కస్టమర్ల నమ్మకం, ఉద్యోగుల కృషితోనే..

మాది తెనాలి. మా అమ్మ వరలక్ష్మి, నాన్న సు బ్బారావు. నాచదువు మొత్తం లండన్‌లో 2009 నుంచి 2014 వరకు కొనసాగింది. 2015లో ఇండియాకు వచ్చాను. ముందుగా ఎపిలోని అ మరావతిలో 2016లో సిఆర్‌డిఏ కింద 8 ప్రాజెక్టులు చేపట్టాను. ఆ సమయం లో నా అక్క కూతురు 3 సంవత్సరా ల పాప(యోషిత) ఒక ప్రమాదంలో చనిపోయింది. దీంతో నా కోడలు పే రు మీద ఏదైనా మంచి పనిచేయాల న్న ఆలోచన మేరకు యోషిత ఇన్‌ఫ్రా డెవలపర్స్ పేరుతో 2020 అక్టోబర్ రి యల్ ఎస్టేట్‌ను ప్రారంభించాను. దీనికోసం హైదరాబాద్ శివారు పరిధిలో సుమారుగా 7వేల కిలోమీటర్లు తిరిగాను. అప్పుడు నాకు సదాశివపేట్ తో పాటు జహీరాబాద్ ప్రాం తంలో వెంచర్‌లు చేస్తే ప్రజలు పెట్టే పెట్టుబడికి భరోసా వస్తుందని భావించాను. అప్పటి నుంచి ఇప్పటివరకు 6 వెంచర్‌లను చేయడంతో పాటు వాటిని విజయవంతంగా విక్రయించగలిగాం. ప్రస్తుతం అందులో పెట్టుబడి పెట్టిన ప్రజలంద రూ తాము ప్రారంభించే ప్రతి వెంచర్‌లో ప్లా ట్ల ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నా రు. ప్రతి వెంచర్‌లోని ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం వె నుక మార్కెట్ టీం కృషితో పాటు క స్టమర్ల నమ్మకం, నన్ను నమ్ముకున్న ఉద్యోగు ల కృషి ఉంది. వారి వల్లే నేను ఈ స్థాయికి వచ్చా ను. మా ప్రతి వెంచర్ హైవేకు అభిముఖంగా లేదా అతి దగ్గరగా ఉండడం వల్ల ప్రజల నుంచి పూర్తి స్థాయిలో స్పందన వస్తుంది.

వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు ఏప్రిల్‌లో..

మొదటగా సదాశివపేట్‌లో నీట్‌గార్డెన్ పేరుతో 11 ఎకరాల్లో (డిటిసిపి) లే ఔట్ చేశాను. రెం డోది సంగారెడ్డికి దగ్గరలో ఉన్న కొత్లాపూర్‌లోని యోషితా గ్రీన్‌మెడోస్ (6 ఎకరాల్లో హెచ్‌ఎండి ఏ) లే ఔట్, మూడోది యోషితా ధరణి ( 33 ఎ కరాల్లో, డిటిసిపి) సదాశివపేట వద్ద, నాలుగోది గ్రీన్‌వ్యాలీ (12 ఎకరాల్లో డిటిసిపి) జహీరాబాద్ వద్ద, ఐదోవది ఎమినెంట్ ఎంఫైర్ సదాశివపేట్, బుదేరా వద్ద (10 ఎకరాల డిటిసిపి లే ఔట్), ఆరోవది యోషితా సుప్రీమ్ జోన్ సదాశివపేట్ హైవే ఫేజ్ మొత్తం 29 ఎకరాల్లో (మొదటి ఫేజ్‌లో 11 ఎకరాలు, డిటిసిపి లే ఔట్), ఏడోవది యోషితా స్ట్రెల్లార్ సదాశిపేట్ దగ్గరలో త్వరలో ప్రారంభం కానుంది. ఈ వెంచర్ మొత్తం 35 ఎకరాల్లో (డిటిసిపి లే ఔట్)తో ప్రారంభించనున్నాం. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు ఏప్రిల్‌లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News