Sunday, December 22, 2024

తెలంగాణ ఏర్పడిన తర్వాత రెట్టింపు రైస్ మిల్లులు

- Advertisement -
- Advertisement -

Double rice mills after formation of Telangana

 

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రెట్టింపు రైస్ మిల్లులు ఏర్పాటు అయ్యాయని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో 1800 ఉంటే నేడు 3400కు పైగా పెరిగాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిల్లులలో భారీగా ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. మహబూబ్ నగర్ శ్రీకృష్ణ థియేటర్ సమీపంలో ఉన్న జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సిఎం కెసిఆర్ ముందుచూపు వల్ల 24 గంటల కరెంటు, రైతు బంధుతో పాటు పుష్కలంగా సాగు నీళ్లు అందించడం వల్ల దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. భారీగా వరి సాగు వల్ల మిల్లర్లకు చేతి నిండా పని దొరికిందని, అనేకమందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు.

కేంద్రం గంప గుత్తగా అన్ని ప్రాజెక్టులు అదాని, అంబానీలకు అప్పగిస్తోందని ఎలా కాకుండా స్థానికులకే ఉపాధి కోసం రాష్ట్రంలో సెజ్ లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హాన్వాడలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ పార్క్ వల్ల రైతులు, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అడిగిన వెంటనే రైస్ మిల్లర్ల సమస్యలపై వెంటనే సంబంధిత శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో మాట్లాడినట్లు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. మంత్రిని మిల్లర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, పీఏసీయస్ చైర్మన్ జూపల్లి భాస్కర రావు, నూతన అధ్యక్ష కార్యదర్శులు మనోహర్, కార్యదర్శి జి విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News