Sunday, December 22, 2024

డబుల్ పరుగులు

- Advertisement -
- Advertisement -

మదనపురం : నిరుపేదలకు గూడు కల్పించాలనే సదాశయంతో సిఎం కెసిఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో డబుల బెడ్ రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. సకల వసతులతో పేదలకు ఇండ్లను కట్టించి ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చొరవతో మదనపురం మండల కేంద్రంలో చేపట్టిన గృహ నిర్మాణాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.
136 డబుల్ బెడ్ రూం ఇండ్లు: మదనపురం మండల కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 136 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసింది. అందుకు గాను 6 కోట్ల 85 లక్షల నిధులను కేటాయించింది. ఆ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని రెండు ఎకరాల స్థలంలో ఇండ్ల నిర్మాణాన్ని ప్రాంభించింది. జి ప్లస్ వన్ పద్ధతిలో 17 బ్లాక్‌లో ఇండ్లను నిర్మించారు. ప్రస్తుతం 96 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయని, మిగతా 40 ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆయా గృహ సముదాయాల్లో ప్రతి కుటుంబానికి కావాల్సిన అన్ని మౌళిక వసతులను కల్పిస్తున్నారు. ప్రస్తుతం సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
పనులపై ఎమ్మెల్యే ఆల ప్రత్యేక దృష్టి : మండల కేంద్రంలో చేపట్టిన 136 గృహ నిర్మాణాల పనులపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనుల పోరగతిని సర్పంచ్ రామనారాయణ అడిగి తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. పనులు ప్రారంభమైన నాటి నుంచి ఎమ్మెల్యే పలుమార్లు స్వయంగా సందర్శించడం కాకుండా స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వడంతో ఇండ్ల పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం సుందరీకరణ పనులు కొనసాగుతుండగా ఆగష్టు లేదా సెప్టెంబర్ నాటికి ఇండ్లను లబ్ధిదారులకు అందించాలనే లక్షంతో శ్రమిస్తున్నారు.
సర్వత్రా హర్షం : డబుల్ బెడ్ రూం ఇండ్లు తుదిమెరుగులు దిద్దుకుంటుండడంతో పేదల్లో సర్వత్రా హర్షాతీరేకాలు వ్యక్తం అవుతున్నాయి, ప్రభుత్వం కట్టిస్తున్న గృహ సముదాయాలు మండల కేంద్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News