Monday, December 23, 2024

డబుల్‌ ఓట్లు 2.15 లక్షలు!

- Advertisement -
- Advertisement -

Double Vote

హైదరాబాద్‌:  సొంత ఊర్లలో, ప్రస్తుతం నివాసం ఉంటున్న పట్టణాల్లో ఓటరుగా నమోదు చేసుకుని… రెండు చోట్ల ఓటింగ్  కొనసాగించాలనుకునే వారికి చెక్‌ పెట్టేందుకు కేంద్రం ఎన్నికల సంఘం రూపొందించిన కొత్త సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా రెండుచోట్ల ఓటరుగా నమోదు చేసుకున్న వారిని గుర్తించి, ఆ బోగస్‌ ఓట్లను ఏరివేయడంపై కేంద్రం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పిఎస్ఈ (ఫొటో సిమిలర్‌ ఎంట్రీస్‌) సాఫ్ట్‌వేర్‌తో రెండేసి ఓట్లు ఉన్న వారి ముఖాలను గుర్తించి వాటిని తొలగించి, ఒక్క చోట మాత్రమే ఓటు ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో తెలంగాణలో డబుల్‌ ఓట్లు 2.15 లక్షలకు పైగా ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ జాబితాలను ఈసీఐ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఈఆర్‌వోలకు చేర వేస్తారు. జాబితాలో ఒక చోట మాత్రమే పేరు ఉంచి, మిగతా వాటిని ఈ నెలాఖరు నాటికి తొలగిస్తారు. ‘ఒకే పోలింగ్‌ స్టేషన్‌, ఒకే నియోజకవర్గం పరిధిలో ఉన్న బహళ ఓట్లను గుర్తించి తొలగిస్తాం. ఇతర రాష్ట్రాల్లోనూ.. తెలంగాణలోనూ ఓటు హక్కు ఉన్న వారి గుర్తింపునకు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేస్తే, వాటిపైనా దృష్టి సారిస్తాం’అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News