Friday, November 8, 2024

రుణమాఫీ సందేహాలకు సమాధానాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రం గానికి సంబంధించి రైతులు బ్యాంకుల్లో తీసుకు న్న పంట మాఫీ 2018డిసెంబర్ 11నాటికి రుణాలు పొందిన వారికి మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. పంట రుణాల మాఫీపై రైతుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ అధికారులు మరింత స్పష్టతనిచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకూ మాత్రమే మాఫీ వర్తింస్తుందని తెలిపారు. 2018 11 నాటికి బ్యాంకులో లక్షకు పైబడి రుణం ఉన్నా మాఫీ మాత్రం లక్ష వరకే వర్తించనుంది. రుణమాఫీ ని బంధనల  మేరకు డిసెంబర్ 11నాటికి బ్యాంకులో లక్షకు మించకుండా అప్పు ఎంత అయితే ఉందో అంత రుణానికీ మాఫీ వర్తిస్తుంది.ఉదాహరణకు రూ.70వేలు ఉంటే అంతటికీ మాఫీ వర్తిస్తుంది.

అయితే 2028డిసెంబర్ 11నాటికి బ్యాంకులో లక్ష రుణం ఉండి ఆ తర్వాత ఆ అప్పును రెన్యూవల్ చేయించుకున్నప్పటికీ , లేదా రుణం మొత్తం వడ్డీతోసహా తిరిగి బ్యాంకుకు చెల్లించినప్పటికీ అటువంటి వారికి కూడా 2018డిసెంబర్ 11కటాఫ్ తేది నాటికి ఎంత బ్యాంకులో ఎంత రుణం వుండి ఉంటే అంత రుణానికి మాఫీ వర్తిస్తుంది. కటాఫ్ తేది నాటికి బ్యాంకులో భార్య పేరుతో 50వేలు, భర్తపేరుతో 70వేలు రుణం ఉంటే అందులో భార్యకు రూ.50వేలు, భర్తకు రూ.5వేల వరకు మాత్రమే రుణం మాఫీ వర్తిస్తుంది. భార్య, భర్తకు కలిపి లక్షకు పైన ఎంత అప్పు ఉన్నప్పటికీ ఇద్దరికీ కలిపి లక్ష వరకూ మాత్రమే మాఫీ వర్తిస్తుంది.లేదా ఇద్దరిలో ఒక్కరికీ మాత్రమే లక్ష వరకు రుణం ఉంటే అది మాత్రమే మాఫీ అవుతుంది. 2018డిసెంబర్ 11కటాఫ్ తేది తర్వాత బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News