Friday, January 24, 2025

మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి మృతిపై అనుమానాలు

- Advertisement -
- Advertisement -

మంథని: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి పట్ల వచ్చిన వార్తలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. చనిపోయింది రాజిరెడ్డి కాదని, సోషల్ మీడియా, ప్రధాన పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చిన వార్తల్లో ఉన్నది అతను కాదని పేర్కొంటున్నారు. మావోయిస్టు వర్గాలు సైతం మల్లా రాజిరెడ్డి మృతి చెందలేదని చెపుతున్నట్లు సమాచారం. ఫోటోలు, వీడియోలో ఉన్నది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు హరఖ్ అలియాస్ శ్రీకాంత్ అని దాదాపుగా దృవీకరించారు. గుండెకు సంబంధించిన తీవ్ర అనారోగ్యంతో ఫ్రిబవరి 26, 2012న అడవిలోనే శ్రీకాంత్ చనిపోయారని,

అతని వీడియో ఇప్పుడు మల్లారెడ్డి పేరుతో వైరల్‌గా మారిందని మావోయిస్టు పార్టీ వర్గాలు మరో వైపు స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేదా రాష్ట్ర పార్టీ కమిటీ అధికార ప్రతినిధి పేరుతో ప్రకటన వచ్చిన తర్వాతనే దీనిపై మరింత క్లారిటీ వస్తుందని పోలీసుల వర్గాలు భావిస్తున్నారు. దీనిపై ఛత్తీస్ ఘడ్ పోలీసులనుంచి రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం కోరగా, అది ఇప్పటి కాదని తేల్చినట్లు అంటున్నారు. అలాగే మరోవైపు సిద్దిపేట జిల్లా కొహెడ మండలం తీగులగుంటపల్లి గ్రామానికి చెందిన తొలి తరం మావోయిస్టు నేత కట్టా రామచంద్రారెడ్డి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై కూడా ఛత్తీస్ ఘడ్ పోలీసుల నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదని గుర్తు చేశారు.
తమకు నమ్మకం లేదు…మల్లారెడ్డి సోదరుడు
మావోయిస్టు దగ్గర నాయకుడు మల్లా రాజిరెడ్డి మృతిపై వారి కుటుంబ సభ్యుల్లో ఎలాంటి ఆందోళన కనిపించడం లేదు. ఆయన మృతిపై తమకు నమ్మకం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టుల నుండి స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడితే తప్ప తాము నమ్మమని ఆయన సోదరుడు పేర్కొన్నారు. కాగా రాజిరెడ్డి సోదరుడు భూమిరెడ్డి వారి కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో మృతి చెందింది రాజిరెడ్డి కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News