Thursday, December 19, 2024

ఇందిరమ్మ రాజ్యంలోనే బడుగుల అభ్యున్నతి

- Advertisement -
- Advertisement -

పరకాల కాంగ్రెస్ సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/వరంగల్ ప్రతినిధి: బడుగు, బలహీన వర్గాల, దళిత, గిరిజన, మైనార్టీ జీవితాల్లో మార్పు కావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి రేవంత్‌రెడ్డి అన్నారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ వర్గాల అ భ్యున్నతి జరిగిందంటే అది ఇందిరమ్మ రాజ్యంలో నే అని అన్నారు. పరకాల పట్టణంలో సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రే వంత్‌రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను స్వరాష్ట్రం రూపంలో సోనియాగాంధీ ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే అన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ప్రతి గ్రామంలో బడి, గుడి, ఇండ్లు, తాగునీరు ఏనాడో వచ్చాయంటే ఇందిరమ్మ రాజ్యం చలవేనని అన్నారు.

ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు, విద్య, ఉపాధి అవకాశాలు లభించి ఆత్మగౌరవంతో బతికారంటే ఇందిరమ్మ రాజ్యంలోనే అన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అలాంటి నాయకుకురాలికి తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి గిఫ్ట్‌గా ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ కుటుంబం మాట ఇస్తే తప్పిన దాఖలాలు లేవన్నారు. 2014లో తెలంగాణ కానుకగా ఇచ్చిన సోనియాగాంధీ నేడు రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలను ప్రకటించారని అన్నారు. ధరణి, రైతుబంధు, ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్‌పై కెసిఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని, 6 గ్యారంటీల్లో ఆ పథకాలు ఉన్నాయని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే పరకాల నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, పిసిసి ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News