Sunday, December 22, 2024

వివాహానికి ముందే వరకట్న వేధింపులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వివాహానికి ముందే వరకట్నం కోసం వేధించిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…డాక్టర్ అనిత కుమారుడు రోహిత్ డెవిడ్ పాల్‌కు ఓ యువతితో వివాహం నిచ్చయం అయింది. ఇద్దరి నిశ్చితార్థం వేడుకలు గత ఏడాది మార్చి 1వ తేదీన కంట్రీక్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. నిశ్చితార్థం కోసం వధువు కుటుంబ సభ్యులు పది లక్షలు ఖర్చు చేశారు. మార్చి నిశ్చితార్థం చేసి జూలైలో వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.

అప్పటి నుంచి వివాహం చేయాలని వధువు కుటుంబ సభ్యులు పలుమార్లు రోహిత్, అతడి తల్లి అనితను పలుమార్లు కలిసినా ఎలాంటి స్పందన రాలేదు. మరింత ఒత్తిడి తేవడంతో రూ.2కోట్లు కట్నంగా తీసుకుని వస్తేనే వివాహం చేసుకుంటామని చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్ గురైన వధువు తల్లిదండ్రులు అంత ఇచ్చుకోలేమని బ్రతిమాలారు. అయినా కూడా రోహిత్ డేవిడ్ పాల్, అతడి తల్లి అనిత వినిపించుకోలేదు. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రోహిత్‌డేవిడ్ పాల్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News