Thursday, November 21, 2024

ప్రముఖ దర్శకుడిపై వరకట్నం వేధింపుల కేసు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత మంజునాథ ఎస్ అలియాస్ మన్సూర్ పై బెంగళూరులో వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. మన్సూర్ పై ఆయన భార్య సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ లో కేసు దాఖలు చేశారు. 2021లో తమకు వివాహం అయినప్పుడు 9 లక్షల రూపాయల నగదు, నగలను కట్నంగా ఇచ్చామని, తన కుటుంబం పెళ్లి ఏర్పాట్లకోసం 30 లక్షలు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. పెళ్లయిన కొన్నాళ్లవరకూ తనను బాగానే చూసుకున్నా, ఆ తర్వాత మరింత కట్నం తేవాలంటూ మన్సూర్ వేధించడం మొదలుపెట్టాడని ఆమె ఆరోపించారు. తరచూ తనపై చేయి చేసుకునేవాడని తెలిపారు. ఆమె ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. తన జీతమంతా మన్సూర్ కే ఇస్తాననీ, తన కుటుంబం కూడా పది లక్షల రూపాయలను అప్పుగా తీసుకుని మన్సూర్ కి ఇచ్చిందని ఆమె తెలిపారు.

అయితే మన్సూర్ కూడా తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య మానసిక స్థితి సరిగ్గా లేదనీ, ఆమె సోదరులు తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఆమెను ఉపయోగించుకుంటున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు మన్సూర్ పై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశారు.

మన్సూర్ కన్నడంలో పేరున్న దర్శక నిర్మాత. ఆయన ‘ఏక్ట్ 1978’, ‘19.20.21’, ‘నాతి చరామి’, ‘హరివు’ వంటి సినిమాలు తీశారు. ‘హరివు’ మూవీకి ఉత్తమ కన్నడ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. ఇదే మూవీకి కర్నాటక రాష్ట్ర ఉత్తమ నిర్మాణం, దర్శకత్వం విభాగాలలో అవార్డులు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News