Wednesday, January 22, 2025

ఉక్రెయిన్ బేకరిపై రాకెట్ల దాడి..28 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మాస్కో : ఉక్రెయిన్‌లో రష్యాఅధీన ప్రాంతంలో ఓ బేకరిపై జరిగిన రాకెట్ల దాడిలో కనీసం 28 మంది దుర్మరణం చెందారు. శనివారం జరిగిన ఈ దాడిలో చనిపోయిన వారిలో ఓ బాలుడు కూడా ఉన్నట్లు రష్యా అధికార ప్రతినిధి ఒకరు ఆదివారంతెలిపారు. లిసిఛాన్స్ నగరంలో బేకరీపై దాడి జరిగింది. దాడిలో బేకరి కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుపడ్డ వారిని సహాయక బృందాలు వెలికితీశాయి. ఈ దాడికి పాల్పడింది ఎవరు? అనేది నిర్థారణ కాలేదు. దీనిపై స్పందించేందుకు ఉక్రెయిన్ అధికారవర్గాలు నిరాకరించాయి. ఇది ఉక్రెయిన్ సేనల దుశ్చర్య అని రష్యా అధికారవర్గాలు ఆరోపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News