Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డాక్టర్ చెరుకు సుధాకర్

- Advertisement -
- Advertisement -

ఎంపి కోమటిరెడ్డి తీరుతోనే పార్టీకి రాజీనామా
కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం పాటించడం లేదు
బిసి వర్గాలకు తగిన అవకాశాలు రావడం లేదు

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన ఏ పార్టీలో చేరనున్నది త్వరలో తేలనుంది. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం పాటించడం లేదని, బిసి వర్గాలకు తగిన అవకాశాలు రావడం లేదని, టికెట్ల కేటాయింపులో అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఉందన్న అసంతృప్తిని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డికి శుక్రవారం రాసిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు తన రాజీనామాకు ఎంపి కోమటిరెడ్డి తీరు కూడా కారణమని ఆయన ఆ లేఖలో వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమకారుడిగా ఆత్మ గౌరవం ఉండే, మెరుగ్గా ఉండే మరో వేదిక కోసం వెతుకులాడుతున్నట్లు ఆ లేఖలో చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డితో పాటు ఇదే జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ సైతం ఎంపి కోమటిరెడ్డి తీరుపై విమర్శలు చేయడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News